తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే వెంటనే బిగ్ బాస్ అని చెబుతాం… గత ఏడాది సీజన్ 4 ముగిసింది.. ఇక సీజన్ 5 ఈ ఏడాది జరుగనుంది.. దీని కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారట.. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో ఐదో సీజన్ని ప్రారంభించాలనుకుంటున్నారు నిర్వాహాకులు.. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా ఉంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీజన్ 5 కూడా చాలా భిన్నంగా చేయాలి అని చూస్తున్నారు.
అందుకే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేస్తున్నారట.. అయితే ఆరు నెలల ముందు నుంచి వారితో డీల్ చేసుకుంటారు.. ఈ సమయంలో వారికి ఉన్న కమిట్మెంట్స్ సినిమాలు షూటింగులు పూర్తి చేసుకుంటారు… సో మొత్తానికి ఇప్పటికే చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈసారి మీడియా నుంచి బుల్లితెర నుంచి పలువురు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం న్యూస్ ప్రజెంటర్ స్వర్ణ రోజా పేరు వినిపిస్తోంది. ఆమె హెచ్ఎంటీవీలో న్యూస్ ప్రజెంటర్గా పనిచేస్తోంది…ఇక ఆమెకి చాలా మంది అభిమానులు ఉన్నారు.. ఆమె మాట కూడా అద్బుతంగా ఉంటుంది… ఇక ఈసారి సీజన్ 5 కి ఆమె కూడా పాల్గోనే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి… మరి చూడాలి ఫైనల్ గా ఎవరు ఈ హౌస్ లోకి వస్తారు అనేది.