బాలయ్య-బోయపాటి కాంబో మళ్ళీ రిపీట్ కానుందా..ఇందులో నిజమెంత?

0
108

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోయిన్ ల నుండి ముద్దుగుమ్మల వరకు అందరితో నటించిన ఈ హీరో బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నాడు.  సింహ , లెజెండ్, అఖండ సినిమాలతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అఖండ సినిమా ఓ ప్రభంజనం సృష్టించడంతో దానికి సీక్వెల్ గా అభిమానుల కోరిక మేరకు అఖండ 2 తీయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.  ఈ విషయమై  అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సినిమా తీస్తారని నమ్మకం లేదు. తాజాగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం బోయపాటి-బాలయ్య కాంబోలో మరో సినిమా రాబోతున్నది.

ఈ సినిమా ‘లెజెండ్’ మాదిరిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్టు..బోయపాటి శ్రీను ప్రస్తుతం కథ పైన శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. కానీ ఈ సినిమా తీయడానికి కొంత టైం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి-బాలయ్య కాంబో అంటే నందమూరి అభిమానులు పండగ చేసుకొవాల్సిన విషయమే.