ఉప్పెన చిత్రం సూపర్ సక్సెస్ అయింది… మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు మంచి పేరు వచ్చింది, తొలి సినిమాతో మంచి రికార్డు సృష్టించారు వైష్ణవ్, ఇక దర్శకుడు బుచ్చిబాబుకి ఈ సినిమా సక్సెస్ ని అందించింది ..50 కోట్ల వసూళ్లు దాటింది సినిమా, ఇక తెలుగులో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా ఈ సినిమాకి మంచి ప్రశంసలు ఇచ్చారు.
ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం అప్పుడే వివిధ భాషల నుంచి ఒత్తిడి మొదలైనట్టు చెబుతున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా గురించి కోలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు ఈ సినిమాని తమిళ్ లో తీయాలని భావిస్తున్నారట, మంచి లవ్ స్టోరీ కాబట్టి సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా కన్నేశాడట. తన తనయుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు, అందుకే మంచి స్టోరీ కోసం చూస్తున్నారు, ఈ ఉప్పెన లైన్ స్టోరీ నచ్చడంతో అక్కడ తన కుమారుడతో ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.