యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస హిట్లు అందుకుంటున్నారు, ఇక తాజాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆయన ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.
ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా బాలీవుడ్ ప్రవేశం చేస్తున్నారు, ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే నేరుగా ఇదే స్టోరీ తీసుకున్నా బాలీవుడ్ కు తగ్గట్లు మార్పులు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదానిపై అనేక వార్తలు ఇప్పటి వరకూ వినిపించాయి.. అయితే బీ టౌన్ లో చాలా మంది పేర్లు వినిపస్తున్నాయి… తాజాగా బాలీవుడ్ భామ అనన్య పాండేతో చర్చలు జరుపుతున్నారట.. ఇక తాజాగా ఆమె లైగర్ చిత్రంలో కూడా నటిస్తున్నవిషయం తెలిసిందే.. పూరీ విజయ్ దేవరకొండ చిత్రం లైగర్ … మరి తాజాగా ఈ ఛత్రపతి సినిమా గురించి అప్ డేట్ రావాల్సి ఉంది.