ఎఫ్ 3 లో వెంకీ – వరుణ్ ఇలా నటించనున్నారా ?

Will Venky and Varun act like this in F3 movie

0
108

ఎఫ్ 2 సినిమా రెండు సంవత్సరాల క్రితం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం ఎంతో సూపర్ హిట్ అయింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక దీని సీక్వెల్ ఎఫ్ 3 గా రానుంది.
హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ ఫన్, ఫ్రస్ట్రేషన్ తో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తోంది. ఈచిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.

వెంకీ సరసన తమన్నా, వరుణ్ కి జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్ నటిస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఇక ఈ రోల్స్ లో వెంకీ, వరుణ్ ఫన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు.

సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రల్లో నటిస్తు‍న్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా రానుంది. ఇక ఈ చిత్రంలో నటీనటులు అందరికి భారీ రెమ్యునరేషన్లు అందుతున్నాయట. సినిమాకి మంచి విజయం పక్కా వస్తుందని ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది అంటున్నారు చిత్ర యూనిట్ .