విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేయనున్నారా ?

Will Vijay Devarakonda make a film with that director after Liger?

0
135
vijay devarakonda

ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు సినిమా అభిమానులు విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పూరీ విజయ్ ని ఎలా చూపిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగును త్వరలో మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. అయితే ఇప్పుడు సుకుమార్ పుష్ప సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తికాగానే విజయ్ దేవరకొండ ప్రాజెక్టును మొదలుపెట్టాలని సుకుమార్ అనుకున్నారు. ఇక పుష్ప రెండు పార్ట్ లుగా రానుంది. సో సుకుమార్ మరో ఏడాది బిజీగానే ఉంటారు.

ఇక లైగర్ పూర్తి అయిన తర్వాత విజయ్ హరీశ్ శంకర్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు పేరు వినిపిస్తోంది. అయితే పవన్ తో సినిమా పూర్తి అయ్యాక హరీశ్ శంకర్ ఈ సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది అని టాలీవుడ్ టాక్. చూడాలి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.