సమంతతో మళ్లీ కలిసి నటిస్తారా? చైతూ సమాధానం ఇదే..

0
118

నాగచైతన్య, సమంత విడాకుల తరువాత తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే చై థాంక్యూ మూవీతో థియటర్లలోకి వచ్చాడు. సామ్ యశోద, శాకుంతలం వంటి సినిమాలు చేస్తుంది. ఇక ఈ జంట ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటూ వార్తలకెక్కుతున్నారు.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత చైతన్యపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక తాజాగా చైతన్య ఓ ఇంటర్వ్యూలో సామ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంతతో కలిసి మళ్లీ నటించాలా వద్దా అనేది ప్రపంచానికే తెలియాలని అన్నారు హీరో నాగచైతన్య. అలానే విడాకుల తర్వాత సామ్​, తాను ఎవరి దారిలో వారు సాగిపోతున్నారని చెప్పారు. “మంచైనా, చెడైనా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నట్లు తెలిపారు చైతూ. అంతకుమించి ఈ ప్రపంచానికి ఏమీ చెప్పాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. సమంత, నేను ఎవరి దారిలో వారు సాగిపోతున్నాం, దీని గురించి ప్రపంచానికి ఏమీ చెప్పాలని అనుకోవడం లేదు” అని చైతూ అన్నారు.

సమంతతో మళ్లీ కలిసి నటిస్తారా? అని అడగ్గా.. అదే జరిగితే చాలా క్రేజీగా ఉంటుంది. కానీ అది జరుగుతుందా? లేదా? అనేది నాకు తెలియదు. ఈ ప్రపంచానికే తెలియాలి. భవిష్యత్​లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో కరణ్ షోకు మీరు వెళ్తారా అని అడగ్గా.. “కాఫీ విత్ కరణ్ షోలోనా? నాకు ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్లను. కరణ్ జోహార్ చాలా గొప్ప వ్యక్తి. అతడు చేసే పని నాకు నచ్చుతుంది. అతడు నన్ను కావాలనుకుంటే ఎందుకు వెళ్లను తప్పకుండా” వెళ్తా అని చైతన్య తెలిపారు.