ఈ ఫెయిల్యూర్ కి విజయ్ కారణం -పాపం దర్శకుడి తప్పులేదట

ఈ ఫెయిల్యూర్ కి విజయ్ కారణం -పాపం దర్శకుడి తప్పులేదట

0
84

విజయ్ దేవరకొండ నటించిన సినిమా, వరల్డ్ ఫేమస్ లవర్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు.. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళిచూపులు, గీత గోవిందం, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలు అతనిలోని ఆర్టిస్టును ఎలివేట్ చేశాయి. తన బాడీ లాంగ్వేజ్ కూడా అందరికి నచ్చింది, అయితే అన్నీ సినిమాలు హిట్ అవుతాయి అని చెప్పలేము.. ప్రజలు కూడా ఏది కనెక్ట్ అవుతారో ఈజీగా చెప్పలేము.

ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్లోనూ తమకు అర్జున్ రెడ్డిలోని విజయ్ దేవరకొండే కనిపించాడని కొందరు విమర్శించారు. అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ ఈ సినిమా పరాజయం పాలైంది. దీంతో బాగా నష్టపోయింది దర్శకుడు క్రాంతి మాధవే.. దీనికి కారణం విజయ్ కు చేతినిండా సినిమాలు ఉన్నాయి.. కాని డైరెక్టర్ అవకాశాల గురించి టాలీవుడ్ లో సీనియర్లు చర్చించుకుంటున్నారు.

మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు తర్వాత కె. యస్. రామారావు పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట క్రాంతి మాధవ్. కానీ ప్రాజెక్ట్ లోకి ఎప్పుడైతే విజయ్ దేవరకొండ వచ్చి చేరారో… మార్పులూ చేర్పులు మొదలయ్యాయట. ఇలా కొన్ని సీన్లు రీ షూట్ చేయించారట మొత్తం విజయ్ ఈ స్క్రీప్ట్ లో వేలు పెట్టడం వల్ల సినిమా అనుకున్నంత రాలేదట.ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ కి మొత్తం కారణం విజయ్ అని బయట టాక్ అయితే నడుస్తోంది..