మన దేశంలో ఘంటసాల తరువాత ఆ స్థాయిలో సంగీత ప్రియులకు ఎంతగానో ఆకట్టుకున్న గాయకుడు SP. బాలసుబ్రహ్మణ్యం. ఆయన లేరు అని తెలియడంతో యావత్ సినీ ప్రపంచం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
తాను మరణించిన తరువాత తన సమాధిపై ఒక ఒక వ్యక్తి చెప్పిన అద్భుతమైన మాటలను రాయగలిగితే చాలా సంతోషమని అన్నారు ఆనాడు బాలు గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు పాడుతా తియ్యగా ఫైనల్స్ లో..
ఈ సమయంలో బాలు గారితో ఓ మాట అన్నారు ఆయన …బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు.. కానీ నేను కష్టపడినా కూడా మా అబ్బాయి అంటే బాలులా పాడలేను అని ఆయన అన్నారు, అంత గొప్ప వ్యక్తి నాపై చేసిన ప్రశంస జీవితంలో మర్చిపోలేనిది. అదే నా ఆస్తి అనుకుంటాను అన్నారు బాలుగారు..
మంగళంపల్లి బాలమురళీకృష్ణ మురళి వంటి గొప్ప సంగీత కళాకారుడు అలాంటి మాటలతో నాకు ఇచ్చిన స్ఫూర్తి జీవితంలో మరిచిపోలేను. నేను చనిపోతే నా సమాధి మీద ఏదైనా రాయాలని అనిపిస్తే ఒక అవతార పురుషుడు ఇతన్ని ఇలా ఆశీర్వదించారు అని రాస్తే సరిపోతుంది అని తెలిపారు.