WWE అండర్టేకర్ కీలక నిర్ణయం

WWE అండర్టేకర్ కీలక నిర్ణయం

0
120

WWE వస్తోంది అంటే చాలు చాలా మంది కళ్లార్పకుండా చూస్తూ ఉంటారు, తమ రెజ్లర్ విన్ అవ్వాలి అని కోరిక ఎవరికి వారికి ఉంటుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ లో లెజెండరీ రెజ్లర్ ది అండర్టేకర్ తెలియని వారు ఉండరు, కొన్ని వందల చాంపియన్స్ అయ్యాడు అతను.

తాజాగా ఇక తన రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అండర్టేకర్ అసలు పేరు మార్క్ కాలవే. గత 30 సంవత్సరాలుగా రెజ్లింగ్లో ఫీల్డ్లో ఉన్న అండర్టేకర్.. లాస్ట్ రైడ్ డాక్యూ సిరీస్ చివరి ఎపిసోడ్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక తాను అన్నీ గెలిచాను అని ఇక బరిలో దిగాలి అని కోరిక లేదు అని.. ఇప్పుడు ఆట అప్పటి ఆటలో చాలా మార్పు వచ్చింది అని అన్నారు. ఇక ఇప్పుడు ఎవరైనా రెజ్లర్ రావాలి అంటే ఇది సరైన సమయం అని తెలిపాడు, దీంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు, ఆయన రిటైర్మెంట్ గురించి
డబ్ల్యూడబ్ల్యూఈ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.