కరోనాతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది పని లేక ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు.. ఇక అన్నీ రంగాలు దెబ్బతిన్నాయి, ముఖ్యంగా సినిమా రంగం దారుణంగా దెబ్బతింది, సినిమా పరిశ్రమలో రోజు వారి కార్మికులుగా ఉన్న వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.సినిమా షూటింగ్స్, థియేటర్స్ మూతపడిపోవడంతో ఎంతో మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయారు.
సెకండ్ వేవ్ వల్ల వేలాది మంది సినిమా కార్మికులు ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలాంటి వేళ అన్నీ సినిమా పరిశ్రమల్లో పెద్దలు ముందుకు వచ్చి వారికి సాయం అందిస్తున్నారు, మన తెలుగు పరిశ్రమ బాలీవుడ్ లో కూడా ఇప్పటికే సాయం అందించారు.
తాజాగా కన్నడ హీరో యష్ సినీ కార్మికులకు అండగా నిలిచారు. కన్నడ చిత్ర సీమలో 3000 మంది కార్మికులకి 1.5 కోట్ల విరాళం ఇస్తున్నారు, ఒక్కొక్కరి ఖాతాలో 5 వేలు జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపారు, ఆయన మంచి మనసుని అభిమానులు అందరూ కొనియాడుతున్నారు.
https://twitter.com/TheNameIsYash/status/1399718733967466501/photo/1