అదరగొట్టిన సామ్..ఆద్యంతం ఆసక్తి రేపుతోన్న ‘యశోద’ టీజర్-Video

0
112

చైతూతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలు చేస్తుంది. ఆ మధ్య పుష్పలో ఐటెం సాంగ్ చేసి తాను ఇంకా పోటీలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. ఇక సామ్ ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి పెద్ద సినిమాలు చేస్తుంది. యూటర్న్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి హిట్ కొట్టింది ఈ బ్యూటీ.

ఇక ఇప్పుడు మరో లేడి ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది యశోద. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్, గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యి అంచనాలు పెంచేశాయి. ఈ మూవీలో సమంత గర్భవతి పాత్రలో నటించడంతో సినిమాపై హైప్ నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది.

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. గర్భవతిగా ఉన్న సమంతను ఎవరో చంపాలనుకోవడం, వారి నుండి సామ్ తప్పించుకోవడం వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అయితే సమంత ప్రెగెన్సీతో వున్నప్పుడు ఏ పనులు చేయకూడదో అవే పనులు చేస్తుంది. మరి అలా ఎందుకు చేస్తుంది? వాళ్లు సమంతను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?list=PLNLUNeWWE62kuzgbUuOEl2SsOVy1allHb&v=NTupxNO-3zE&feature=emb_title