Yatra 2 | ఓటీటీలోకి వచ్చేసిన ‘యాత్ర2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2(Yatra 2)‘ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం విడుదలైన ఈ మూవీ డిసెంట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా వైసీపీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తండ్రి వైఎస్సార్ మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

తమిళ హీరో జీవా(Jiiva) జగన్ పాత్రలో నటించగా.. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్‌ కనిపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘యాత్ర 2(Yatra 2)’ కూడా అభిమానులను అలరించింది.

Read Also: లిక్కర్ స్కాంలో కవితకు మరో ఎదురుదెబ్బ.. సీబీఐ కస్టడీకి అనుమతి..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...