యాక్షన్ కింగ్ అర్జున్ కూతురితో యంగ్ హీరో సినిమా..

0
127

యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే నటించిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకొని తన మార్క్ చుపెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం తన కూతురిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అర్జున్ దర్శకత్వంలో యంగ్ హీరోతో సినిమా చేయాలనీ యోచిస్తున్నాడు అర్జున్.

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో అర్జున్ దర్శకత్వంలో సినిమాకు ఒకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

యాక్షన్ కింగ్ అర్జున్ విశ్వక్ సేన్ కోసం ఒక మంచి వినూత్న పాత్రతో కథను సిద్ధం చేశాడని కథ విన్న విశ్వక్ కూడా నచ్చడంతో తప్పకుండా చేద్దామని చెప్పినట్లు సమాచారం కుడా తెలుస్తుంది. అందర్నీ ఆశ్చర్య పరిచే మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా అర్జున్ కుమార్తె కూడా నటించబోతున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాపై అధికారికా ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.