సరి కొత్త రోల్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డిఫరెంట్ స్టోరీ

0
84

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్  సినిమా చేస్తున్నారు… ఈ చిత్రంలో తారక్  కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు, తారక్ చరణ్ ఇద్దరూ  ఈ సినిమాలో నటిస్తున్నారు,  ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత  తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు.

 

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ తో పాటు ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల్లో కేజీఎఫ్ 90 పర్సెంట్ పూర్తి అయింది.. సలార్ 50 శాతం షూటింగ్ ఉంది… ఇక కరోనా వేవ్ తగ్గిన తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది, ఆ తర్వాత తారక్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

 

మరి తారక్ ని ఏ విధంగా ఇందులో చూపిస్తారు అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో తన మార్క్ చూపిస్తున్న ప్రశాంత్ ఎన్టీఆర్ తో సరికొత్త జోనర్ లో సినిమా తీస్తారు అని టాలీవుడ్ టాక్ .. అయితే ఇప్పుడు ప్రశాంత్ నేటి పొలిటికల్ అంశాలను జోడించి ఓ అద్బుత యంగ్ పొలిటీషియన్ రోల్  తారక్ తో చేయిస్తున్నారట… ఇప్పటి వరకూ ఎవరూ చూపించని కాన్సెప్ట్ తో తారక్ ని ఇందులో చూపిస్తారని టాలీవుడ్ టాక్ .  ఈ చిత్రంలో  మిగిలిన కాస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది.