జబర్దస్త్ కమెడియన్ నా చెంప పగలగొట్టాడు- పూరిగారి వరకూ ఈ విషయం వెళ్లింది అవినాష్

-

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్, పలు సినిమాలు చేశాడు పలు షోలు కూడా చేశాడు.. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంట్రీ ఇచ్చి అందరిని నవ్వించాడు… హౌస్ లో అతని ఆటతో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతోంది. తాజాగా ఇంటర్వ్యూలలో పలు విషయాలు చెబుతున్నారు అవినాష్.

- Advertisement -

తాజాగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ నా చెంప పగలగొట్టాడు అంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు అవినాష్… అయితే ఓ పక్క షూటింగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో. ఒకవైపు లోన్ లో తీసుకున్న ఫ్లాట్, మరోవైపు అప్పులు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ సమయంలో సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాను.

ఇండస్ట్రీలో నాకు ఉన్న మంచి మిత్రుడు నా బాధ ఏది ఉన్నా ముందుగా చెప్పుకునేది గెటప్ శ్రీను అన్నతోనే. అన్నా.. నాకు ఎలానో అనిపిస్తోంది. చచ్చిపోవాలని ఉందని చెప్పాను, ఇంటికి రమ్మన్నాడు, వెళ్లగానే చెంపపై రెండు కొట్టాడు, ఇలాంటి ఆలోచన వద్దు అన్నాడు, పూరీగారితో శ్రీను అన్న చెప్పాడు, ఆయన ఎన్నో విషయాలు చెప్పారు..నీ జీవితం ఒక సినిమా లాంటిది. అందులో నువ్వే హీరో. అప్పుడప్పుడు సినిమాలు హిట్టవుతాయి.. ప్లాప్ అవుతాయి..నీ టైమ్ వస్తుంది వెయిట్ చెయ్ అని ఆయన భరోసా ఇచ్చారు అని ఆనాటి విషయాలు చెప్పుకున్నాడు అవినాష్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...