Grammy Awards | గ్రామీ అవార్డులు గెలుచుకున్న జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్..

-

ప్రపంచ సంగీత రంగం ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల్లో భారతీయులు సత్తా చాటారు. 66వ గ్రామీ అవార్డుల(Grammy Awards) ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు తమ పాటలతో సందడి చేశారు.

- Advertisement -

ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డును శక్తి(Sakthi)పేరుతో కంపోజ్‌ చేసిన ‘దిస్‌ మూమెంట్‌’(This moment)అల్బమ్ సొంతం చేసుకుంది. జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకీర్‌ హుస్సేన్ (తబలా), శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌) ‘శక్తి’ బ్యాండ్‌ పేరుతో ఈ ఆల్బమ్‌ కంపోజ్‌ చేశారు. అలాగే ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శనకు గాను జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ కూడా అవార్డు అందుకున్నారు. ‘మిడ్‌ నైట్స్‌ ఆల్బమ్‌’కు గానూ టేలర్‌ స్విఫ్ట్‌ ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం అందుకున్నారు.

Grammy Awards Winner 2024..

గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ – శక్తి (దిస్ మూమెంట్‌)

గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్రదర్శన – జాకిర్‌ హుస్సేన్‌, బెలా ఫెక్‌ (పష్టో)

ఉత్తమ క్లాసికల్‌ సోలో వోకల్‌ ఆల్బమ్‌ – జూలియా బూల్లక్‌, సోలోయిస్ట్‌ (వాకింగ్‌ ఇన్‌ ద డార్క్‌)

ఉత్తమ ర్యాప్‌ ఆల్బమ్‌ – మైఖేల్‌ (కిల్లర్‌ మైక్‌)

ఉత్తమ ఆఫ్రికన్‌ సంగీత ప్రదర్శన – టైలా (వాటర్)

ఉత్తమ రాక్‌ సాంగ్‌, ప్రదర్శన- బాయ్‌జెనియస్‌ (నాట్‌ స్ట్రాంగ్‌ ఎనఫ్‌)

ఉత్తమ రాక్ ఆల్బమ్‌- పారామోర్‌ (దిస్‌ ఇజ్‌ వై)

ఉత్తమ కామెడీ ఆల్బమ్‌- డేవ్‌ చాపెల్‌ ( వాట్స్ ఇన్ ఏ నేమ్‌)

ఉత్తమ కంట్రీ సాంగ్‌, సోలో ప్రదర్శన – క్రిస్‌ స్టేప్లెటన్‌ (వైట్‌ హార్స్‌)

మ్యాజిక్‌ వీడియో – జోనథన్‌ క్లైడ్‌ ఎమ్‌ కూపర్‌ (ఐయామ్‌ ఓన్లీ స్లీపింగ్‌)

Read Also: వేలమంది రైతుల కన్నీళ్లు.. ఆకట్టుకుంటున్న ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...