జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్..పూర్తి వివరాలివే..

0
100

డ్యాన్స్ అంటే మీకు ఇష్టమా? ఏదైనా ప్రముఖ ఛానల్ డ్యాన్స్ షోలో పాల్గొనాలని కల కంటున్నారా? ఇప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వబోతుంది జీ తెలుగు. అవును రియాలిటీ షోలతో తనదైన మార్క్ వేసుకున్న జీ తెలుగు, తాజాగా మరో కొత్త షోకు శ్రీకారం చుట్టబోతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు ఈ ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ షోలో పాల్గొనేందుకు జీ తెలుగు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారిని తాము నిర్వహించే ఆడిషన్స్‌కు హాజరు కావాల్సిందిగా జీ తెలుగు ప్రకటించింది. ఇప్పటికే మొదలైన ఈ ఆడిషన్స్, వరంగల్, ఖమ్మం, కర్నూల్, విజయవాడ, తిరుపతి, వైజాగ్‌లో జరగగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కిందని జీ తెలుగు నిర్వాహకులు అంటున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈ డ్యాన్స్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లు జీ తెలుగు నెట్‌వర్క్ తెలిపింది.

జూలై 3న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో 6 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య వయసుగల వారు, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉన్నవారు తమ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది జీ తెలుగు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు జీ తెలుగు ఈ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో నిర్వహిస్తున్నట్లు ఛానల్ నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ డ్యాన్స్ షోలో పాల్గొనాలని అనుకునే వారు డిజిటల్ ఆడిషన్స్‌ కూడా ఇవ్వచ్చు. వారు డ్యాన్స్ చేసిన వీడియోలను 9154984009 నెంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని.. did.zeetelugu@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చని.. లేదా didtelugu.zee5.com వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ వీడియోలను పంపవచ్చని నిర్వాహకులు ప్రకటించారు.