త్రిషని ఫైనల్ చేసిన చిరు – కన్ఫామ్ చేసిన త్రిష

త్రిషని ఫైనల్ చేసిన చిరు - కన్ఫామ్ చేసిన త్రిష

0
478

టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమాలు విడుదల అంటే ఇప్పటికి అభిమానులకు అది సంక్రాంతి అనే చెప్పాలి.. ఆయన సినిమా విడుదల అయితే అది పెద్ద పండుగ అనే అంటారు.. తాజాగా ఆయన తన 152 వ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో రామ్చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి.. కోలీవుడ్ బాలీవుడ్ నుంచి చాలా మంది పేర్లు వినిపించాయి. మళ్లీ కాజల్ అన్నారు కాని ఆమె కాదు అని మరో వార్త వచ్చింది. తాజాగా చిరంజీవితో త్రిష నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ.. చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ఓ కోలీవుడ్ విశ్లేషకుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాల్లో నటిస్తుందంటూ అందులో చిరంజీవి కొరటాల శివ సినిమా ఒకటంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో త్రిష చిరుతో మరోసారి నటిస్తోంది అనేది తేలిపోయింది, దీనిపై త్రిష కూడా క్లారిటీ ఇస్తూ ఎస్ నిజమే అని విక్టరీ సింబల్ ఇచ్చింది. దీంతో 2020 కి ఆమె చిరుతో సినిమా ఒకే చేసుకున్నారు అని ఫైనల్ అయింది.