పవన్ కల్యాణ్- రానా సినిమాకి టైటిల్ ఇదేనా ?

Is this the title of Pawan Kalyan-Rana movie?

0
341

పవన్ కల్యాణ్ తన సినిమాల జోరు పెంచారు. ప్రస్తుతం సెట్స్ పై రెండు సినిమాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ – రానా కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరగడంతో షూటింగును ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండడంతో, ఈ నెల 11వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి.

అయితే ఈ సినిమాకి టైటిల్ ఏమిటా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీని గురించి కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ఒక టైటిల్ ను పరిశీలిస్తునట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రానా ఇద్దరి పాత్రలు ముఖ్యమైనవే. అక్కడ మలయాళంలో ఈ రెండు పాత్రల పేర్లను కలిపే టైటిల్ పెట్టారు.

అదే పద్ధతిని తెలుగు రీమేక్ లోను పాటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ ను సెట్ చేయాలనుకుంటున్నారట. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చూడాలి దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ.