బాహుబలి 2 సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ప్రభాస్ అయితే నేషనల్ స్టార్ అయిపోయాడు.. రాజమౌళి కి దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది.. ఇక తాజాగా ఎవెంజర్స్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కలెక్షన్ లతో దుమ్ము రేపుతుండగా ఈ రెండు చిత్రాల కలెక్షన్ల విషయం లో బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ బాహుబలి ని కించపరిచేలా ఉంది.. దీంతో ఈ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చారు..
ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సాధించిన తొలి వారం వసూళ్ళని ట్వీట్ చేయగా వసూళ్ళని బాలీవుడ్ ఇతర చిత్రాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ వర్సెస్ బాలీవుడ్ బడా చిత్రాలు తొలివారం సాధించిన వసూళ్లు అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అవెంజర్స్ చిత్రం తొలివారం ముగిసేసరికి 260 కోట్లు సాధించి టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 నిలిచింది. బాహుబలి 2 తొలివారం 247 కోట్లు సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో సుల్తాన్ 229 కోట్లతో, టైగర్ జిందా హై 206 కోట్లతో నిలిచాయి.
అయితే బాహుబలి 2 నార్త్ ఇండియాలో కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలై ఆ స్థాయి వసూళ్లు రాబట్టిందని శోభు పేర్కొన్నారు. మిగిలిన చిత్రాలన్నీ అన్ని భాషల్లో విడుదలయ్యాయి అని తెలిపారు. శోబు బాహుబలి నిర్మాతల్లో ఒకరు. 2017లో విడుదలైన బాహుబలి చిత్రం అప్పటివరకు ఉన్న ఇండియన్ సినిమాల రికార్డులు చెరిపివేస్తూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.