భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి పెద్ద మొత్తంలో AK-47, SLR, INSAS రైఫిల్స్, 303 రైఫిల్స్, రాకెట్ లాంచర్, BGL లాంచర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.
Chhattisgarh | శుక్రవారం సుక్మా జిల్లాలోని కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో DRG, CRPF సంయుక్త బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అనంతరం ఎన్‌కౌంటర్ స్థలం నుండి నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరింత మంది మావోయిస్టులు మరణించి ఉండవచ్చు లేదా గాయపడి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి.