రూ.2 వేల నోట్ల చెలామణిపై ఆర్బీఐ(RBI) సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆ నోట్లు నిల్వ చేసుకున్న వారంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, రెండు వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వొద్దని బ్యాంకులకు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఈనెల(మే) 23 నుంచి దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్లు ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ(RBI) స్పష్టం చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా నోట్లు రద్దు చేసినట్లు తెలిపింది.
Read Also: అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టు కమిటీ క్లీన్ చిట్!
Follow us on: Google News, Koo, Twitter