గుజరాత్ అల్లర్ల కేసు(2002 Gujarat Riots)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 69 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి మాయా కొద్నానీ, బాబు భజరంగిపై ఉన్న అభియోగాలను గురువారం కోర్టు కొట్టివేసింది. కాగా, 2002 ఫిబ్రవరిలో నారోదాగామ్ అల్లర్లలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో 86 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మాయా కొద్నానీ, భజరంగ్ దళ్ నేత బాబు భజరంగి సహా 86 మంది నిందితులు విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా.. దీనిపై ఇవాళ(ఏప్రిల్ 20) ప్రత్యేక కోర్టులో విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించింది.
- Advertisement -
Read Also: ‘పొంగులేటిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే బాధ్యత రేణుకా చౌదరి తీసుకోవాలి’
Follow us on: Google News, Koo, Twitter