ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని సంభాల్‌లో హింస చెలరేగింది. హిందూ ఆలయాన్ని కూల్చి మొఘలులు మసీదు కట్టారన్న పిటిషన్ విచారణలో భాగంగా మసీదులో సర్వే చేపట్టాలని కోర్డు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్ధానం ఆదేశాల మేరకు మసీదును సర్వే చేయడం కోసం అధికారులు సంభాల్ చేరుకోగ వారికి అక్కడి ముస్లింల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పోలీసులు, ముస్లింల(Muslim Mob) మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇందులో ముగ్గురు యువకులు మరణించగా, పలువురు పోలీసులు గాయపడ్డారు. సర్వే కోసం వచ్చిన పోలీసులపై స్థానిక ముస్లింలు రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలకు సైతం నిప్పంటించారు.
దీంతో అదనపు బలగాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అధికారులు. ఇందులో భాగంగానే టియర్ గ్యాస్‌తో పాటు రబ్బర్ బుల్లెట్లను వినియోగించారు. అనంతరం పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి సంభాల్‌లోని పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.