దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court)లో కరోనా కలవరం రేపింది. రెండు రోజులుగా కొందరు జడ్జిలు, లాయర్లు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటవ్ వచ్చింది. దీంతో కోర్టు పరిసరాల్లో కొవిడ్ ఆంక్షలు అమలు చేశారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 7వేలకు పైగా కేసులు నమోదుకాగా.. 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు వెల్లడించారు.
- Advertisement -
Read Also: ఏంటి బాసూ రహానేకు ఏమైంది? అసలు ఆ కొట్టుడేంటి
Follow us on: Google News, Koo, Twitter