కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (BRS) బుధవారం లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) ప్రవేశపెట్టగా, ప్రధాని మోదీ ఇదే విషయాన్ని అంచనా వేసిన ఐదేళ్ల నాటి వీడియో వైరల్‌గా మారింది. 2023లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావాలని విపక్షాలను కోరుతూ ప్రధాని మోదీ లోక్‌సభలో నవ్వులు పూయించడాన్ని వీడియోలో చూడవచ్చు. 2018లో జరిగిన విశ్వాస పరీక్షలో ఎన్డీయే భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) ఈ ప్రకటన చేశారు.
2018లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అనేక పార్టీలు మద్దతు ఇచ్చాయి. లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్(Sumitra Mahajan) విశ్వాస పరీక్షకు అనుమతించగా ఎన్డీయేకు 314 ఓట్లు వచ్చాయి. “2023లో మీరు మళ్లీ అవిశ్వాస తీర్మానం తెచ్చే అవకాశం వచ్చేలా మీరు బాగా సిద్ధం కావాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు. ఐదేళ్ల క్రితమే 2023లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావాలంటూ మోడీ ప్రెడిక్ట్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మణిపూర్ ఆగ్రహావేశాల మధ్య పార్లమెంటులో ప్రభుత్వంపై భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) తీసుకురావాలని నిర్ణయించింది.
Opposition is bringing a No confidence motion against government which PM Modi had predicted 5 years ago! pic.twitter.com/PBCaUe3fqG
— DD News (@DDNewslive) July 26, 2023