బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి

-

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.

- Advertisement -

West Bengal | ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Read Also: అమిత్ షా సభపై ఈటల రాజేందర్ ధీమా
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...