పార్లమెంటు(Parliament)లో దుండగులు దాడికి సంబంధించి ఎనిమిది మంది భద్రతా సిబ్బంది సస్పెండ్ అయ్యారు. వారి నిర్లక్ష్యమే సభలో దాడికి కారణమైందని నివేదికలో వెల్లడయింది. CRPF డీజీ నేతృత్వంలో వేసిన కమిటీ రిపోర్టులో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించింది. కారణాలు విశ్లేషించిన తర్వాత అధికారులు 8 మందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సీఆర్పిఎఫ్ డీజీ నేతృత్వం వహిస్తున్నారు.
Parliament | పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. 8 మంది అధికారులు సస్పెండ్
-