Gujarat | అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనంపైకి దూసుకెళ్లిన కారు

-

గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం జరగ్గా.. అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని శాటిలైట్ ప్రాంతంలోని సర్ఖేజ్ గాంధీ నగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ బ్రిడ్జి‌పై తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఓ కారు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది.

- Advertisement -

Gujarat | దీంతో మిగతా వాహనదారులు, పాదచారులు అక్కడ గుమిగూడారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేస్తుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ జాగ్వార్ కారు అక్కడ గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది స్పాట్‌లోనే మృతిచెందగా.. అందులో ఇద్దరు పోలీసులు ఉన్నారని, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Read Also: మణిపూర్‌ అల్లర్లపై ఫస్ట్ టైం స్పదించిన ప్రధాని
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...