మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో మాంద్‌సౌర్ కలెక్టరేట్‌లో ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపారు. తనకు న్యాయం చేసే వరకు తగ్గేదే లేదన్నారు. కలెక్టరేట్ అంతా పొర్లుదండాలు పెట్టడం ప్రారంభించాడా రైతు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. మాంద్‌సౌర్ ప్రాంతానికి రైతు శంకర్లాల్ పాటిదార్‌కు చెందిన భూమిని కలెక్టర్ ఆఫీసులో పనిచేసే బాబు దేశ్‌ముఖ్ అనే అధికారిక నకిలీ పత్రాలతో ఆక్రమించేసుకున్నాడు. స్థానిక రౌడీలు, గూండాల సహాయంతో బెదిరించి తమ భూమిని 2010లో దేశ్‌ముఖ్ తన కొడుకు పేరు మీద రాయించేసుకున్నాడని శంకర్‌లాలు వాపోయాడు.
Madhya Pradesh | అప్పటి నుంచి తాను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పారు. అసలైన పత్రాలతో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, జూలై 16వ తేదీన కూడా కలక్టరేట్‌కు వస్తే అధికారులు స్పందించకపోవడంతో చేసేదేమీ లేక పొర్లుదండాలు పెడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు శంకర్ లాల్. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ స్పందించి ఆయనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన భూ వివాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.