ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్‌కి అరుదైన గౌరవం

-

చంద్రయాన్3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియాను నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తల పట్ల ప్రజలు అమితమైన గౌరవం అందిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇస్రో చైర్మన్(ISRO Chairman) సోమనాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. దీంతో ఇండిగో సిబ్బంది ఆయనను ఎంతో ప్రత్యేకంగా గౌరవించారు. విమానం బయలుదేరే ముందు ఆయన గురించి చెబుతూ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

- Advertisement -

“ఈరోజు విమానంలో మనతో పాటు ఓ విశిష్ట వ్యక్తి కూడా ఉన్నారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్(ISRO Chairman Somanath) గారు ఈ విమానంలో ఉన్నందుకు ఇండిగో ఎంతో సంతోషిస్తోంది. మీకు సేవలు అందించే అవకాశం వచ్చినందుకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. చంద్రయాన్3 ప్రయోగంలో దేశం గర్వపడేలా చేసిన మీకు మా ధన్యవాదాలు” అంటూ తెలిపారు. ఈ అనౌన్స్మెంట్ పూర్తి కాగానే విమానంలోని ప్రయాణికులంతా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించి భారత ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్‌-3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామన్న ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్‌ – 3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా.. తన మనసంతా చంద్రయాన్‌ – 3 విజయంపైనే ఉందన్నారు.

ఇప్పుడు ఇంటింటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందన్నారు. ఇప్పటివరకూ ఏ దేశం చేయలేనిది చేసి.. ప్రపంచానికి మన సత్తా చాటామన్నారు. చంద్రయాన్‌-3 ల్యాండైన ప్రాంతానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. అలాగే చంద్రయాన్‌-2 దిగిన ప్రదేశానికి తిరంగా పాయింట్‌గా పేరు పెడుతున్నట్టు తెలిపారు. చంద్రయాన్‌-3 సక్సెస్‌లో మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఎంతో ఉందన్న ప్రధాని.. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే చంద్రయాన్‌-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్‌ స్పేస్‌ డేగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని.. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామన్నారు మోదీ.

Read Also: 200 రోజులు పూర్తిచేసుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...