ఎస్పీ నేతపై చెప్పుతో దాడి చేసిన యువకుడు

-

యూపీ రాజధాని లక్నో(Lucknow)లో జరిగిన సమాజ్‌వాద్ పార్టీ(SP)ఓబీసీ సమ్మేళనంలో ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maurya)పై ఓ యువకుడు దాడి చేశాడు. లాయర్‌ వేషంలో ఉన్న ఆ యువకుడు చెప్పులు కూడా విసిరాడు. దీంతో అక్కడ దుమారం చెలరేగింది. ఎస్పీ కార్యకర్తలు అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్వామి ప్రసాద్‌ మౌర్యపై దాడి చేసిన ఆ యువకుడిని ఆకాష్‌ సైనీగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విభూతిఖండ్(Vibhuti Khand) పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

హిందూమతంపై స్వామి ప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maurya) చేసిన వ్యాఖ్యలు తనను బాధించినట్టు చెప్పాడు ఆ యువకుడు. ఐతే అతను నిజంగా లాయరేనా లేక న్యాయవాది వేషంలో వచ్చాడా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. లక్నో ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో ఓబీసీ సమ్మేళనం జరుగుతోంది. ఈ సదస్సుకు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కూడా రావాల్సి ఉంది. అంతలోనే ఈ గొడవ జరిగింది.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షా 40వేల జీతంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...