యూజర్లకు అభినందనలు తెలిపిన ఆజ్ తక్ యూట్యూబ్ ఛానల్ సీఈఓ

0
AajTak

AajTak becomes world’s first news channel to cross 50 million subscribers on YouTube: ఈ సంవత్సరారంభంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూట్యూబ్‌లో 50 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల ను సొంతం చేసుకున్న మొట్టమొదటి న్యూస్‌ ఛానెల్‌గా ఆజ్‌తక్‌ నిలిచింది. ఈ రికార్డ్‌ ఫీట్‌ను 2019లో 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మార్కును దాటిన మూడు సంవత్సరాలలోనే పొందడం విశేషం. ఈ మైలురాయిని చేరుకోవడంపై యూట్యూబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మరియు చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ న్యూస్‌ టీమ్‌ను అభినందించారు.

యూట్యూబ్‌ సీఈఓ సుసాన్‌ వోజ్‌కికి ట్విట్టర్‌లో తన అభినందనలు తెలుపుతూ ‘‘ 50 మిలియన్‌ చందా దారులు – ఆజ్‌తక్‌ మరియు దాని న్యూస్‌ బృందానికి ఇది అద్భుతమైన మైలురాయి’’ అని అన్నారు.

యూట్యూబ్‌ సీపీఓ నీల్‌ మోహన్‌ మాట్లాడుతూ ‘‘యూట్యూబ్‌పై 50 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించిన మొదటి న్యూస్‌ ఛానెల్‌గా నిలిచిన ఆజ్‌తక్‌ మరియు బృందానికి అభినందనదల’’న్నారు.

ఆజ్‌తక్‌ తమ డిజిటల్‌ ప్రయాణాన్ని 2009లో తమ యూట్యూబ్‌ ఛానెల్‌ ఏర్పాటుతో ప్రారంభించింది. 2017లో మొట్టమొదటిసారిగా తమ న్యూస్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించింది. 2019లో ఈ ఛానెల్‌ 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించడం ద్వారా డైమండ్‌ ప్లే బటన్‌ అందుకుంది. ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాలలో ఆజ్‌తక్‌ 50 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని చేరుకున్న మొదటి న్యూస్‌ ఛానెల్‌గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here