ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ లిస్టులో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆప్ లో చేరిన ఆరుగురి పేర్లు ఉండటం విశేషం. బ్రహ్మ సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగి బీజేపీ మాజీ నేతలు కాగా.. చౌదరీ జుబైర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేశ్ షోకీన్ కాంగ్రెస్ నుంచి ఆప్ లో జాయిన్ అయ్యారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపి బయటకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దీంతో రానున్న ఎన్నికలు ఆప్(AAP) కి మరింత ప్రతిష్టాత్మకం కానున్నాయి.