కేసీఆర్ పాలనలో కేవలం ఆయన కుటుంబానికే ప్రయోజనం చేకూరిందంటూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు(All India Mahila Congress President) నెట్టా డిసౌజ విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగడం లేదని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళల ఆకాంక్షలను ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. లక్ష రూపాయల పంటరుణ మాఫీ ఉసే లేదని.. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
All India Mahila Congress President | భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయని, కనీసం పరీక్షలు కూడా సరిగా రాయించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. మరోసారి కేసీఆర్ మాయ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని సూచించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సామాజిక న్యాయం, అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని తెలిపారు.