కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇంచు జాగాను కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని అన్నారు. సోమవారం అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. సరిహద్దులను పోలీసులు, భారత ఆర్మీ కంటికిరెప్పలా చూసుకుంటున్నాయని, ఈ పరిస్థితిల్లో భారత్‌పై చెడుకన్ను వేసే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు. ”దేశ ప్రజలందరూ ఇవాళ ప్రశాంతంగా ఇళ్లలో నిద్రిస్తున్నారంటే అందుకు మన సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాస్తున్న మన ఐటీబీపీ(ITBP) జవాన్లు, ఆర్మీనే కారణం. దుష్టపన్నాగంతో మన భూభాగంపై కన్నేసే సాహసం ఎవరూ చేయలేరు.
ఈ విషయాన్ని మనం ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. జవాన్ల త్యాగాలకు నేను సెల్యూట్ చేస్తున్నారు. 1962లో ఇక్కడ భూమిని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారెవరైతే ఉన్నారో వారు ఇవాళ మీ దేశభక్తి కారణంగా వెనక్కి వెళ్లిపోయారు” అని చైనా(China)ను పరోక్షంగా ఉద్దేశించి అమిత్‌షా(Amit Shah) అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ”లుక్ ఈస్ట్ పాలసీ”తో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని, ఇప్పుడు ఆ ప్రాంతాలు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయని హోం మంత్రి అన్నారు.
Read Also: EC సంచలన నిర్ణయం.. కేసీఆర్, కమ్యూనిస్టు పార్టీకి భారీ షాక్
Follow us on: Google News, Koo, Twitter