Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం పక్కనోళ్లకు మాయమాటలు చెప్పేవారిని ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెత ఇది. అయితే ఒక దొంగ దీనిని అక్షర సత్యం చేశాడు. కాకపోతే గుడిని వదిలేసి.. గుడిలో లింగాన్ని ఎత్తుకుపోయాడు. ఈ ఘటన మహాశివరాత్రి(Maha Shivaratri) నాడు జరగడంతో ఇది మరింత విశేషంగా మారింది. ఈ దొంగతనం గుజరాత్‌లోని ద్వారకలో(Dwaraka) అరేబియా సముద్ర ఒడ్డున ఉన్న శ్రీభిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో(Shree Bhidbhanjan Bhavaneeshvar Mahadev Temple) చోటు చేసుకుంది.
ఇది చాలా పురాతన ఆలయంలో(Ancient Temples) అందుకే ఇక్కడికి వేల మంది భక్తులు వస్తుంటారు. అక్కడ శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ఊహించని స్థాయిలో ఆలయానికి చేరుకున్నారు. ఉదయాన్నే గుడి తెరిచి చూస్తే అంతా షాక్.. గుడిలో దేవుడు లేడు. శివలింగాన్ని ఎవరో దొంగలించేశారు. ఇది చూసి అర్చకులు సహా భక్తులంతా కూడా ఖంగుతిన్నారు.
Gujarat | వెంటనే అప్రమత్తమైన అర్చకుడు.. ఈ విషయాన్ని దేవదాయ శాఖ(Endowment Department) అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. శివలింగాన్ని సముద్రంలో ఏమైనా పడేశారా? అన్న అనుమానంతో స్కూబా డైవర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ కెమెరాల రికార్డింగ్ ద్వారా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న అనేక పురాతన, విలువైన విగ్రహాలు తరచూ చోరికీ గురవుతున్నాయి. వాటిని ఎత్తుకెళ్తున్న వారు ఆ విగ్రహాలను భారీ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా దొంగలించబడిన విగ్రహాల్లో దొరికిన వాటిని చేతి వేళ్లపై లెక్కించవచ్చు. మరి ఈ శివలింగం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.