Karnataka Elections |కర్ణాటక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రజలపై పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు హామీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ఆకర్షణీయమైన పథకం ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతం పెంచుతామని సంచలన ప్రకటన చేసింది. అంగన్ వాడీల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ.15వేలు, మినీ అంగన్ వాడీల్లో పనిచేసే మహిళలకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఇస్తామని తెలిపింది. అలాగే ఆశా వర్కర్లకు రూ.8వేలు, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే మహిళలకు రూ.5వేలు ఇస్తామని పేర్కొంది. అంతేకాకుండా అంగన్ వాడీ మహిళలకు పదవీ విరమణ లేదా అకాల మరణంపై సంభవిస్తే రూ.3లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. అటు మినీ అంగన్ వాడీలో పనిచేసే మహిళలకూ అయితే రూ.2లక్షలు ఇస్తామని వెల్లడించింది.
Read Also: ప్రపంచంలోనే ఎక్కువగా స్మగ్లింగ్ అయ్యే జంతువు ఏదంటే?
Follow us on: Google News, Koo, Twitter