బెంగళూరు వేదికగా విపక్షాల భేటీ రోజు కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా 25 కీలక పార్టీలు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో సమావేశం అయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ(PM Modi) గత పదేళ్లలో దేశంలోని ప్రతి రంగాన్ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ప్రజల మధ్య ద్వేశాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థను చిందరవందర చేశారని మండిపడ్డారు. మోడీ హాయాంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు అన్ని రంగాల్లో నిరుద్యోగం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామా? అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.