లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని.. డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్స్ ఇవ్వడం లేదని ఈడీ తరపు న్యాయవాది ఎస్వీరాజు వాదించారు. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
దీంతో ఆయనను అధికారులు తిహార్ జైలు(Tihar Jail)కు తరలించనున్నారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ డిప్యూటీ సీఎంలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. కాగా ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్(Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా తొలుత ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల కస్టడీ విధించింది.