Asaduddin Owaisi |సోనియా గాంధీపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు

-

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలోని హుబ్బలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోనియాపై విమర్శల వర్షం కురిపించారు. RSS మూలాలున్న జగదీష్ షెట్టర్‌ తరపున సోనియా ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఇదేనా కాంగ్రెస్ సెక్యూలరిజం అని ప్రశ్నించారు. ఇలాంటి సిద్ధాంతాలతో లోక్ సభ ఎన్నికల్లో మోదీతో ఎలా పోరాడతారని ఆమెను ఒవైసీ(Asaduddin Owaisi) నిలదీశారు. తమను బీజేపీ బీ టీమ్ అని కాంగ్రెస్ నాయకులు నిందించడం విడ్డూరమని ఫైర్ అయ్యారు. కాగా కర్ణాటక బీజేపీ కీలక నేతైన జగదీష్ షెట్టర్‌కు అధిష్టానం టికెట్ నిరాకరించడంతో కమలానికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న జగదీష్ షెట్టర్ తరుఫున సోనియా ప్రచారం నిర్వహించారు.

- Advertisement -
Read Also: ORR కాంటాక్ట్‌లో భారీ కుంభకోణం ఉంది: కిషన్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...