Modi Statue | భారత ప్రధాని మోడీకి దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన వయస్సు ఏడుపదులు దాటినా.. 17 ఏళ్ల కుర్రాడిగా పోటీగా కొత్త ట్రెండ్స్ విషయంలో అప్డేటెడ్ గా ఉంటారు. ఆయనే కొత్త ట్రెండ్స్ సెట్ చేస్తారు కూడా. ఆయన సైలెంట్ గా చేసే పనులు కూడా ఎంత వైలెన్స్ క్రియేట్ చేస్తాయో చెప్పాలంటే రీసెంట్ గా జరిగిన మాల్దీవ్స్ వ్యవహారమే. లక్షద్వీప్ పర్యటన చేసి.. ఎక్కడా మాల్దీవ్స్ పేరు ఎత్తకుండా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేశారు. అలా ఉంటాయి మరి మన ప్రధాని ఎత్తుగడలు. హిందువుల ఐదు దశాబ్దాల కల అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన నెరవేర్చి ఆయన చరిష్మా మరింత పెంచుకున్నారు.
ఈ క్రమంలో అస్సాం గౌహతికి చెందిన వ్యాపారవేత్త ఒకరు మోదీపై తన అభిమానాన్ని చాటుకోవాలని భావించాడు. నబీన్ చంద్ర బోరా అనే వ్యాపారి 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహాన్ని(Modi Statue) ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విగ్రహ నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు అవుతుంది అని అంచనా. ఈ విషయాలను మీడియాకి వెల్లడించిన నబీన్.. 250 అడుగుల ఎత్తు భారీ విగ్రహంలో 60 అడుగుల పునాదిపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విగ్రహ నిర్మాణానికి అయ్యే ఖర్చంతా తానే సొంతంగా భరిస్తున్నట్టు వెల్లడించారు. విగ్రహాన్ని గౌహతిలోని జలుక్ బరి ప్రధాన బస్టాండు వద్ద ఉన్న బోరా సొంత స్థలంలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, విగ్రహ నిర్మాణం కోసం సోమవారం మొదలైన భూమి పూజ మూడు రోజుల పాటు కొనసాగింది. 190 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం మెడలో అస్సామీ సంస్కృతికి చిహ్నంగా ఉండే గమోసా ఉండే విధంగా డిజైన్ రూపొందించినట్లు సమాచారం. ఈ విగ్రహ నిర్మాణ ప్రణాళికను వ్యాపారి నబీన్ చంద్ర ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది.