Lunar Eclipse: మూఢ నమ్మకాలు వదలాలంటే.. దాడికి తెగబడ్డారు

-

Attack on HRO officials at Odisa on Lunar Eclipse Meal program: గ్రహణం అనేసరికి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు.. వంట చేయకూడదు, ఆహారం తీసుకోకూడదు అనే మూఢ నమ్మకాలు ఇంకా నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. మూఢ నమ్మకాలు వదిలేయాలంటూ, గ్రహణం సమయంలో తిన్నా ఏం జరగదంటూ అవగాహన కల్పించేందుకు మానవతావాది హేతువాది సంస్థ(హెచ్‌ఆర్‌ఓ) ఒడిశాలోని గంజాంలో గ్రహణ (Lunar Eclipse) సమయంలో భోజనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది.

- Advertisement -

గ్రహణం సమయంలో భోజన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ.. గంజాం జిల్లా బ్రాహ్మణ పురోహిత సమితి, భజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంస్థలు ఆందోళనకు దిగాయి. ఆయా సంస్థల ప్రతినిధులు రెండు వైపులా చారవాక్‌ భవన్‌ వద్దకు చేరుకొని, హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులపై కర్రలతో దాడికి దిగారు. మరికొందరు హెచ్‌ఆర్‌ఓ ప్రతినిధులపై పేడతో దాడి చేశారు. పరిస్థితి చేయదాటేలా ఉండటంతో.. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టినా.. ఆయా సంస్థల ప్రతినిధులు చారవాక్‌ భవన్‌ వద్ద హెచ్‌ఆర్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...