Bengaluru | మార్కెటింగ్ అనేది ఒక ఆర్ట్. మన దగ్గర ఉన్న ఒక వస్తువును కస్టమర్లు కొనుగోలు చేసేలా చేయడమే ఇందులో అంతిమ లక్ష్యం. అయితే తాజాగా ఓ ఆటోవాలా మాత్రం ఇందులో మరో అడుగు ముందుకేశాడు. తాను తయారు చేసిన ప్రొడక్ట్‌ను కాకుండా.. తనకున్న ఐడియానే మార్కెటింగ్ ప్రొడక్ట్‌గా మార్చేశాడు. తన సొంత స్టార్టప్‌కు ఫండ్స్ రైజ్ చేయడం కోసం అతడు అత్యంత వినూత్న పద్దతిని ఎంచుకున్నాడు. అతని ఐడియా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్న విధంగానే.. అనుకున్నది సాధించడానికి ఎన్నో ఎత్తులు వేయాల్సి ఉంటుందని నెటిజన్లు సదరు ఆటోవాలాను కొనియాడుతున్నారు. ఆ ఆటోవాలా పేరు శామ్యూల్ క్రిస్టీ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన సొంత స్టార్టప్‌ను స్థాపించాలనేది అతని కల. దాన్ని సాకారం చేసుకోవడం కోసం ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
Bengaluru | ఈ సందర్భంగానే తన స్టార్టప్ సహాయం చేయాలని ప్యాసింజర్లను కోరుతున్నారు. అలాగని సహాయం చేయండని అడగడం లేదు. ‘‘హాయ్ ప్యాసింజర్.. నా పేరు శ్యామ్యుల్ క్రిస్టీ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అయితే నేను ప్రస్తుతం నా స్టార్టప్ బిజినెస్ ప్రారంభించడానికి నిధులను సేకరిస్తున్నాను. మీకు ఆసక్తి ఉంటే.. ఈ విషయంపై నాతో చర్చించగలరు’’ అని రాసిన నోట్‌ను తన సీటు వెనక అతికించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘అతను నిజంగా గ్రేట్. తన ఆశయాన్ని చేరడం కోసం ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు అని కొందరు. అతని ఆలోచన చాలా బాగుంది. అదే విధంగా తన ఐడియాను మార్కెటింగ్ చేసే పద్దతి కూడా చాలా వినూత్నంగా ఉంది’’ అంటూ కొనియాడుతున్నారు.