Bangalore court orders pass for temporary suspension on Bharat Jodo Yatra’s Congress Twitter handle: కాంగ్రెస్ పార్టీకు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను వాడుకున్నారని కాంగ్రెస్‌పై కాపీ రైట్ కేసు దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా, ఆ కేసు విచారణకు రాగా, వాదనలు విన్న బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్వీటర్ హ్యాండల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కాపీ రైట్ నిబంధన కింద రాహుల్ గాంధీతో పాటు, జైరామ్ రమేశ్, సుప్రియపై చర్యలు తీసుకోవాలంటూ కేజీఎఫ్ సినిమాకు సంగీతం అందించిన ఎంఆర్‌టీ సంస్థ నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా.. కేజీఎఫ్ సంగీతాన్ని జోడో యాత్రకు సంబంధించిన వీడియోకు జత చేశారని నవీన్ కుమార్ కోర్టుకు తెలిపారు.
జోడో యాత్రకు కేజీఎఫ్ సంగీతాన్ని జత చేసి ట్విట్టర్‌లో జైరామ్ రమేశ్ పోస్టు చేసిన రెండు వీడియోలను ఆధారాలుగా చూపించారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు కోర్టు.. భారత్ జోడో యాత్ర ప్రచారానికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మునుగోడు బైపోల్‌లో ఓడిపోయిన కాంగ్రెస్‌కు.. తాజా కోర్టు తీర్పు.. మెుట్టికాయ లాంటిదనే చెప్పుకోవచ్చు. జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతోందని చెప్తుండగా.. ప్రస్తుతం కోర్టు తీర్పు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగలిందని చెప్పుకోవచ్చు.
We have read on social media about an adverse order from a Bengaluru court against INC & BJY SM handles.
We were neither made aware of nor present at court proceedings. No copy of the order has been received.
We are pursuing all the legal remedies at our disposal.
— Congress (@INCIndia) November 7, 2022