Jaishankar |భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే వ్యవహారంపై ఆయన మరోసారి స్పందించారు. జీ-20 విదేశాంగశాఖ మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఐటీ సర్వేపై క్లారిటీ ఇచ్చారు. భారత చట్టాలకు బీబీసీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. పన్ను ఎగవేత, యాడ్స్‌పై ఆదాయాన్ని చూపించలేదన్న కారణాలతో కొద్దిరోజుల క్రితం ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సర్వే చేసింది. అయితే గుజరాత్ అల్లర్లపై ప్రధాని మోదీకి సంబంధించిన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన్నందుకే బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేశారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు ఆరోపించాయి.