Bengaluru | ప్రాణం తీసిన పందెం.. బాంబుపై కూర్చున్న వ్యక్తి..

-

దీపావళి రోజున స్నేహితులతో కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణం బలితీసుకుంది. పందెం ప్రకారం దీపావళి బాంబుపై కూర్చిని ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందెం కాసిన వారందరిపై కేసు నమోదు చేయాలని, ఇటువంటి పందెం కాయాలనుకునేవారికి వీరిపై నమోదు చేసే కేసు, తీసుకునే చర్యలు గుణపాఠంగా మారాలని నెటిజన్లు అంటున్నారు. ఈ ఘటన బెంగళూరు(Bengaluru)లో జరిగింది. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. కొందరు స్నేహితులు మద్యం మత్తులో ఉన్న శబరీష్ అనే వ్యక్తితో పందెం కాశారు. బాంబుల పెట్టెపై కూర్చుంటే ఆటో రిక్షా కొనిస్తామని పందెం కాశారు. అందుకు శబరీష్ ఓకే చెప్పాడు.

- Advertisement -

Bengaluru | పందెం ప్రకారం.. బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్‌ బాక్స్‌పై శబరీష్ కూర్చున్నాడు. వెంటనే అతడి స్నేహితులు టపాసులను అంటించారు. పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ బాంబులన్నీ పేలాయి. కానీ శబరీష్ అలానే ఉండి వెనక్కు పడిపోయాడు. ఏమైందా అని చూడటానికి వచ్చిన స్నేహితులు శబరీష్ పరిస్థితి విషయమంగా ఉందనుకుని హుటాహుటి ఆసుపత్రికి తరలించారు. కానీ శబరీష్ అప్పటికే మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. బాంబుల పేలుడు ధాటిని శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి పందెం కాసిన ఆరుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: అసెంబ్లీ ఉపఎన్నిక వాయిదా.. మళ్ళీ అప్పుడే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...