Bengaluru |చీరలంటే భారత మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే డిస్కౌంట్ లో వస్తున్నాయంటే ఆ షాపుకు ఎగబడతారు. అలాంటి ఘటనే బెంగళూరు(Bengaluru)లో చోటుచేసుకుంది. మల్లేశ్వరం ప్రాంతానికి చెందిన మైసూర్ సిల్క్ శారీ సెంటర్ ఇటీవల డిస్కౌంట్ ధరలతో శారీ సేల్ నిర్వహించింది. అంతే చీరలు కొనేందుకు మహిళలు అక్కడికి పోటెత్తారు. అంతవరకు బాగానే ఉన్నా.. చీరలు ఎంచుకునే క్రమంలో ఒకే చీర ఇద్దరు మహిళలకు నచ్చింది. ఇంకేముంది అక్కడ ఓ పెద్ద యుద్దమే జరిగింది. నాకే కావాలని ఇద్దరూ జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు చీర కోసం చంపుకునేలా ఉన్నారని కొందరు.. డిస్కౌంట్ సేల్ పెట్టినప్పుడు ఆ మాత్రం గొడవ ఉండాలని మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.??♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 ?️ (@rvaidya2000) April 23, 2023
Read Also: కేసీఆర్‌పై గవర్నర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter