G 20 సదస్సు: భారత్ ఎదుట భారీ ఎజెండా

-

G20 Summit కు సర్వం సిద్ధమైంది. అగ్ర దేశాధినేతలు భారత్ కు చేరుకుంటున్నారు. శిఖరాగ్ర సదస్సుకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే ఈ సదస్సు వేదికగా భారత్ ఎలాంటి ఎజెండా ప్రవేశపెట్టనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ ఎజెండా పై జీ 20 వేదికగా ఏకాభిప్రాయానికి తీసుకువచ్చేలా భారత్ ఎలాంటి దౌత్య ప్రయత్నాలు చేయనుంది అనే చర్చ కొనసాగుతోంది. కాగా ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, యుద్ధం వంటి అంశాలతో అతలాకుతలం అవుతున్న ప్రపంచ దేశాలని వాటి నుంచి బయటపడేందుకు మార్గాల కోసం G 20 కూటమి దేశాల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా భౌగోళిక రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా ఆదిత్య దేశంగా అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ ప్రపంచ ఆర్థిక సవాళ్లకు మానవీయ దృక్పథంతో పరిష్కారాలు సూచించేలా పట్టుబడుతోంది. ఇందుకోసం శని, ఆదివారాల్లో జరగనున్న సమ్మిట్ తర్వాత సంయుక్త ప్రకటన చేసేందుకు సభ్య దేశాలను ఒప్పించేందుకు భారత్ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

- Advertisement -

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు ఒక్కొక్కరుగా ఇవాళ్టి నుంచే ఢిల్లీ చేరుకోనున్నారు. ముందుగా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగుతారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనను రిసీవ్ చేసుకుంటారు. ఆయన కోసం ఏర్పాటు చేసిన షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్ బస చేయనున్నారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దేశ రాజధానికి చేరుకోనున్నారు. అగ్రదేశాధినేతలు రానుండడంతో ఢిల్లీలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సిసి కెమెరాలు, కౌంటర్ డ్రోన్ సిస్టం ను మోహరించారు. G 20 కూటమిలోని సభ్య దేశాలతో పాటు… 11 ఆహ్వాన దేశాలు, UNO, IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు రానున్నారు.

శనివారం జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సు ముందు భారీ ఎజెండానే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను స్ట్రీమ్ లైన్ చేయడం, క్రిప్టో కరెన్సీ లపై నియంత్రణ, గ్రీన్ డెవలప్మెంట్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై సదస్సు దృష్టి సారించింది. ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న పేరు దేశాలను ఆదుకునేందుకు, అభివృద్ధి కొనసాగించేందుకు వీలుగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి బ్యాంకులను సంస్కరించి బలోపేతం చేయాలని g20 కూటమి భావిస్తోంది. విశాల హృదయంతో ఈ బ్యాంకుల ద్వారా పేద దేశాలకు రుణాలు, ఇతర సాయం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన కోసం భారీగా నిధులు సమకూర్చడానికై G20 Summit లో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్యాంకులను ఎలా సంస్కరించాలి? భవిష్యత్తులో రుణాలను ఎలా అందించాలో నిర్దేశించడానికి ఓ అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పేదరికాన్ని తగ్గించి, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఇందుకోసం 2030 కల్లా ఇప్పుడు ఇస్తున్న రుణాలను 3 రెట్లు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సాధించాలంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఏటా 500 బిలియన్ డాలర్లు అదనంగా అవసరమని అంచనా వేస్తున్నారు. దీనికోసం అమెరికా 50 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ముందుకు రాగా… ఇతర దేశాల నుండి భారీగా నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు ఆందోళనకరంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి రాజ్యాల సాయం పై చర్చలు కొనసాగుతున్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు హరిత సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించడంలో అగ్ర దేశాలు నత్తనడకన నడుస్తుండడం పట్ల అసంతృప్తి నెలకొంది.

ఆర్థిక, సాంకేతిక సహాయం చేయకుండా తమను సాంప్రదాయేతర ఇంధనం వైపు నడిచేందుకు ఒత్తిడి తెస్తున్నారని.. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశాలపై G20 Summit లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక నేరస్తులు ఏ దేశంలో ఉన్నా వారిని కట్టడి చేయడం, అప్పజెప్పడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పై ఓ ఒప్పందం కుదుర్చుకునేలా కార్యాచరణ రూపొందించేలా భారత్ జీ20 దేశాలపై ఒత్తిడి చేస్తోంది. ఈ అంశం పైన సదస్సులో చర్చించే అవకాశం ఉంది.

Read Also: మూడుముళ్ల బంధానికి ఈ ‘ మూడు’ ఎంతో అవసరం!!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...